● పల్స్ ఫార్మా డైరెక్టర్ ఆచార్య దేవరాజ్‌రామ్‌బహు
కేయూ క్యాంపస్ : పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు నూతన ఆవిష్కరణలు అవసరమని హైదరాబాద్ పల్స్ ఫార్మా డైరెక్టర్, కేయూ ఫార్మసీ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ దేవరాజ్‌రామ్‌బహు పేర్కొన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో దివంగత ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ వై.మధుసూదన్‌రావు తొలిస్మారకోపన్యాసంలో ఆయన ఇన్నోవేటివ్ నానోడ్రగ్ డెలవరీ ప్లాట్‌ఫామ్స్ అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, హైబ్రిడ్ పంటల ప్రభావంతో ముఖ్యమైన ఖనిజాల లోపం పెరుగుతోందన్నారు. ఫార్మసీ విద్యా, పరిశోధన రంగానికి ప్రొఫెసర్ మధుసూదన్‌రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎండోమెంట్ లెక్చర్‌కు కేయూ ఓఎస్‌డీ ప్రొఫెసర్ బి.వెంకట్రామ్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కమిటీ బాధ్యులు కిషన్, షాయాదా, డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. తొలుత దివంగత ప్రొఫెసర్ మధుసూదన్‌రావు చిత్రపటానికి అతిథులు, ఆచార్యులు, పరిశోధలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


