సాక్షి, మహబూబాబాద్: పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అయితే పథకాన్ని నమ్ముకుని ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు చివరి బిల్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి పెంచిన అధికారులు బిల్లులు ఇచ్చే సమయంలో ముఖం చాటేస్తున్నారు. అప్పుతెచ్చి ఇల్లుకట్టాం.. బిల్లు ఇప్పి ంచండి అంటూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరగా బిల్లులు ఇప్పించమని వేడుకుంటున్నారు.
గృహ ప్రవేశాలు చేసిన రాని బిల్లులు..
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు అధికారులు చెప్పిన విధంగా ఇల్లు నిర్మించుకొని గృహ ప్రవేశాలు పూర్తి చేసుకున్నా.. నేటికీ చివరి బిల్లులు రాలేదు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,651 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 8,994 ఇళ్లు ప్రారంభించారు. మిగిలిన 1,657 ఇళ్లు వివిధ కారణాలతో ప్రారంభించలేదు. కాగా, మున్సిపాలిటీల పరిధిలో నిర్మా ణం పూర్తి చేసిన 392 ఇళ్ల మొత్తం బిల్లులు రాగా.. 3,151ఇళ్ల లబ్ధిదారులకు చివరి బిల్లు రాలేదు.
అప్పులు చేసి అవస్థలు ..
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో చాలామంది లబ్ధిదారులు అప్పులు తెచ్చి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఇందులో ప్రభుత్వం నుంచి బేస్‌మెంట్ బిల్లు రూ.లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రూ.లక్ష చెల్లించారు. స్లాబ్ పోసిన తర్వాత రూ.1,40,000.. మొత్తం రూ. 3,40,000 మాత్రమే లబ్ధిదారులకు చేరాయి. మిగిలిన రూ.1.60లక్షలు ఇప్పటివరకు అందలేదు. అయితే ఇందులో రూ. 12వేల టాయిలెట్స్ కోసం, ఉపాధిహామీ పథకం ద్వారా 90రోజుల పనిదినాలకు రూ.7వేలు.. మొత్తం రూ.39వేలు ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. వీటితో రూ.1.21లక్షలు లబ్ధిదారులకు అందించాలి. అయితే ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఉండడంతో ఆలస్యమవుతున్నట్లు తెలిసింది.
ఇందిరమ్మ ఇళ్లు పూర్తయినప్పటికీ ఖాతాల్లో జమకాని చివరి బిల్లు
ఇంటి నిర్మాణం కోసం చేసిన
అప్పులతో లబ్ధిదారుల ఇబ్బందులు
బిల్లులు ఇప్పించాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
మొత్తం మంజూరైన ఇళ్లు 10,651
ప్రారంభించినవి 8,994
ఇప్పటికీ ప్రారంభించనివి 1,657
భూమిలెవల్ 5,36
బేస్‌మెంట్ లెవల్ 1,223
రెంటల్ లెవల్ 705
స్లాబ్‌లెవల్ 2,987
నిర్మాణం పూర్తయినవి 3,543


