మహబూబాబాద్ రూరల్ : జిల్లా సహకార అధికారి(డీసీఓ)గా మాలోత్ సర్దార్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ఉన్నత అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీసీసీబీలో డీఆర్/ఓఎస్‌డీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన మహబూబాబాద్ డీసీఓగా విధుల్లో చేరనున్నారు.
ప్రత్యామ్నాయ లైన్లతో విద్యుత్‌సరఫరా
నెహ్రూసెంటర్: నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఆరు ఇంటర్‌లింక్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. 33/11కేవీ సబ్‌స్టేషన్ నుంచి మరొక 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు.. మరో 132/32 కేవీ సబ్ స్టేషన్‌కు, ఇదే విధంగా 33 కేవీ లైన్ నుంచి మరొక 33 కేవీ లైన్‌కు అనుసంధానం చేయడం ద్వారా ప్ర త్యామ్నాయ విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.


