పాఠశాలలను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలను బలోపేతం చేయాలి

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో బుధవారం గిరిజన పాఠశాలల హెచ్‌ఎంలు, ఎస్‌సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశీరాంనాయక్‌ మాట్లాడుతూ.. ప్రతీ హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూ వెల్ఫేర్‌ ఆఫీసర్లు యూడబ్ల్యూహెచ్‌ఎంఎస్‌లో ఎంప్లాయ్‌ ప్రొఫైల్‌ త్వరితగతిన అప్‌డేట్‌ చేయాలన్నారు. రాజీవ్‌ విద్యా దివేన పథకంలో విద్యార్థుల దరఖాస్తుల ప్రకియ పూర్తి చేయాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని, జిల్లాలో గిరిజన పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల చదువు సామర్థ్యాలు పెంపొందించాలని, ఎఫ్‌ఎల్‌ఎన్‌ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, సారంగపాణి, సక్రూ, సురేందర్‌, డీఆర్‌పీ, ఎస్‌సీఆర్పీలు పాల్గొన్నారు.

పౌష్టికాహారం అందించాలి

హాస్టల్‌ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీరాంనాయక్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన కళాశాల హాస్టల్‌ను ఆయన సందర్శించి, మాట్లాడారు. హాస్టల్‌లో విద్యార్థులకు సమస్యలు ఉంటే, ఫిర్యాదు బాక్సులో వినతి పత్రాలు వేయాలన్నారు. స్టోర్‌ రూంలో బియ్యం, నిత్యావసర సరుకులను పరిశీలించారు. కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ సీతారాములు, వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement