గంగారం: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం, కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అజీవిక యోజన పథకం అమలు, విత్తనాల పంపిణీ తీరును పరిశీలించారు. 10రకాల కూరగాయల విత్తనాల కిట్స్‌ను 752మంది రైతులకు పంపిణీ చేశారు. స్థానిక రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతంగా జరుగుతున్న ఫార్మ్ పాండ్ (నీటి కుంటల) పనులను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల పరిధిలో లబ్ధిదా రులకు అందుతున్న పింఛన్ల పంపిణీ, తదితర అంశాల తీరును పరిశీలించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు.
కేజీబీవీ తనిఖీ..
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, భోజన వసతి, పారిశుద్ధ్యం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఉద్యానశాఖ అధికారి మరియన్న, తహసీల్దార్ బాలకృష్ణ, ఎంపీడీఓ వైష్ణవి, ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
ఎంపీడీఓ కార్యాలయం, కేజీబీవీల ఆకస్మిక తనిఖీ


