గూడూరు: పులుల రక్షణతో పర్యావరణ సమతు
ల్యత సాధ్యమవుతుందని ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూ ల్‌లో బుధవారం గూడూరు ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ రేంజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్వో పులుల వివరాలు, లక్షణాలు, పులులు లేకపోతే నష్టాలు, కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, దేశంలో, రాష్ట్రంలో పులులు ఎలా ఉన్నాయి, అటవీ శాఖ తరఫున తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం పెండెం హరిశంకర్, ఉపాధ్యాయులు శరత్‌బాబు, సునీత, వెంకటేశ్వర్లు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎమ్మార్పీరావు, బుచ్చిబాబు, రమేష్, శ్రీనివాస్, పుష్పలత, శ్రీధర్, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.


