మహబూబాబాద్ రూరల్ : మిర్చి రైతులకు ఎన్‌ఎస్ ట్రేడర్స్ వ్యాపారి డబ్బులు చెల్లించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అధికారి పద్మావతి అన్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం రైతులు మిర్చి డబ్బులు చెల్లించాలని ధర్నా చేపట్టిన నేపథ్యంలో బుధవారం డీడీఏం మార్కెట్ సందర్శించి విచారణ చేపట్టారు. రైతుల వద్ద నుంచి సదరు వ్యాపారి ఎంత మేరకు మిర్చి కొనుగోలు చేశాడు, చెల్లింపులు ఏ విధంగా జరిగాయని పరిశీలించారు. ఎనిమిది మంది రైతులకు రూ.22.56 లక్షల నగదు త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ పరిధిలో క్రయ విక్రయాలు నిర్వహించే వ్యాపారులు ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు చేసే విధంగా చూడా లన్నారు. జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, సెక్రటరీలు సుజన్ బాబు, శ్రీనివాసరాజు ఉన్నారు.


