సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్) సవరణ ప్రక్రియ ముగియడానికి ఇంకా 11 రోజులే గడువు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగానికి కూడా చేరుకోలేదు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నిత్యం కాన్ఫరెన్స్‌ల ద్వారా అలర్ట్ చేస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు నిత్యం ఫాలోఅప్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి 8.01 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆరు జిల్లాల్లో కలిపి 45.57 శాతం ఫారాలే డిజిటలైజ్ అయ్యాయి.
ఫారాల పంపిణీలో భేష్..
జూన్ 25న మొదలైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బీఎల్‌ఓల ఇంటింటి సందర్శన, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ఈ నెల 24న ముగియనుంది. వీటికి ఇంకా 11 రోజులే సమయం ఉండగా, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ చేయాల్సి ఉంది. మొత్తం 30,53,238 మంది ఓటర్లకు సంబంధించి 30,53,231 ఫారాలు (100 శాతం) పంపిణీ చేశారు. అయితే, వాటిలో 13,91,440 (45.57 శాతం) ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన లక్షలాది ఫారాలను గడువులోగా నమోదు చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. విద్యావంతులు, పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనే నింపిన ఫారాల అందజేత, డిజిటలైజేషన్ వేగం మందగించింది. హనుమకొండలో 42.97 శాతం, వరంగల్‌లో 40.39 శాతం , మహబూబాబాద్‌లోనూ 42.62 శాతం మాత్రమే పూర్తయ్యింది.
53.66 శాతంతో ముందంజలో ములుగు..
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తంగా చూస్తే 50 శాతం దాటలేదు. ఇక గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లా మాత్రం 53.66 శాతంతో ఉమ్మడి జిల్లాలో ముందంజలో నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి (50.36 శాతం), జనగామ (50.18 శాతం) జిల్లాలు కూడా కొంత మెరుగైన పురోగతి నమోదు చేశాయి. ఫారాల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారుల దృష్టి డిజిటలైజేషన్‌పైనే ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ‘సర్’ డిజిటలైజేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ముమ్మరం చేసిన అధికారులు సోమవారం నుంచి వేగం పెరుగుతుందని, ఇన్‌టైంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతి.. ( ఆదివారం రాత్రి 8.01 గంటల వరకు)
మొత్తం ఓటర్లు ఫారాలు పంపిణీ
పంపిణీ శాతం డిజిటలైజేషన్
డిజిటలైజేషన్ శాతం
50.36%
50.18%
53.66%
40.39%
100%
42.97%
1,39,955
4,84,932
1,27,167
42.62%
7,67,483
7,76,953
3,85,152
7,67,484
2,77,882
4,84,935
5,09,014
2,36,970
3,13,806
2,18,699
2,77,879
2,06,661
జేఎస్‌భూపాలపల్లి
హనుమకొండ
జనగామ
వరంగల్
మహబూబాబాద్
ఎన్యూమరేషన్ ప్రక్రియకు 11 రోజులే గడువు
ఉమ్మడి జిల్లాలో ఇంకా 45.57 శాతమే డిజిటలైజేషన్
ముందున్న ములుగు.. అదే వరుసలో జనగామ, జేఎస్ భూపాలపల్లి
40–43 శాతంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు


