నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

వేయిస్తంభాల దేవాలయంలో మాసశివరాత్రి పూజలు

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌ : కలెక్టరేట్‌లో ఈనెల 13న జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అఽధికారులందరూ క్షేత్రస్థాయిలో‘సర్‌’ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారన్నారు. ఈమేరకు సోమవారం జరిగే ప్రజా వాణిని రద్దు చేశామని, ప్రజలు దరఖాస్తులతో కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.

హన్మకొండ కల్చరల్‌: మాసశివరాత్రిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం ఐదు గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం నాట్యమండపంలో వేదపండితుడు వెంకటేశ్వరశర్మ, అర్చకులు రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్ఠించారు. కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణోత్సవంలో బీజేపీ సీనియర్‌ నాయకులు రావు అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

పాండవుల గుట్టల్లో

రాక్‌ క్లైంబింగ్‌

రేగొండ: సాహసాలు ఇష్టపడే వారికి క్లైంబింగ్‌ ఓ గొప్ప అనుభూతి. మండలంలోని తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టల్లో హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైట్‌ క్యాంప్‌లో శనివారం బసచేశారు. విద్యార్థులు ఆదివారం పాండవుల గుట్టలను సందర్శించి ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌ చేశారు. పాండవుల గుట్టలను సందర్శించే పర్యాటకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ చంద్రమౌళి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement