వైద్యులు సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు సమయపాలన పాటించాలి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

డీసీహెచ్‌ఎస్‌ చింత రమేశ్‌

గార్ల: వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్‌ చింత రమేశ్‌ ఆదేశించారు. గురువారం గార్లలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. వార్డులను పరిశీ లించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని, ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్లకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తూ నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి డయాలసిస్‌ సెంటర్‌ మంజూరైందని, త్వరలో యంత్ర సామగ్రి అమర్చుతారని పేర్కొన్నారు. నూతనంగా స్పెషలిస్ట్‌ వైద్యురాలు కృష్ణవేణి జాయిన్‌ అయ్యారని, త్వరలో మరికొంత మంది స్పెషలిస్ట్‌ వైద్యులు విధుల్లో చేరుతారని ఆయన వెల్లడించారు. సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌గౌడ్‌, డాక్టర్లు బాలునాయక్‌, నాగేశ్వరరావు, సతీష్‌, కృష్ణవేణి, అన్నపూర్ణరెడ్డి, నర్సింగ్‌ ఆఫీసర్లు స్వాతి, మెర్సీరాణి, రాణి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement