ఇనుగుర్తి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడి బాట’ కార్యక్రమంలో చిన్నముప్పారం మహిళా సర్పంచ్ తన కూతురుకు అడ్మిషన్ తీసుకుని ఆదర్శంగా నిలిచా రు. వివరాలు ఇలా ఉన్నాయి.. చిన్నముప్పారం మహిళా సర్పంచ్ రాయలి భవాని శేఖర్ తన కూతురు మహతిని ప్రైవేట్ పాఠశాలను కాదని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నారు. అలాగే తమ మిత్రుడు గుండు వేణు కుమారుడు రుత్విక్‌ను కూడా అదే పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించి ప్రభుత్వ విద్యపై తమకున్న నమ్మకాన్ని చాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ భవాని శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సరైన వసతులు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులెవరూ ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వెంకటరెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు


