గూడూరు: మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి తిరుమల నర్సింగ్‌హోంలో అనుమానాస్పద గర్భస్రావం జరిగిందన్న సమాచారంతో గురువారం డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నర్సంపేట డివిజన్ చెన్నరావుపేట మండలం పుల్లయ్యబోడుతండాకు చెందిన ఓ మహిళకు అనుమానాస్పద కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిందని, ఆస్పత్రి రికార్డులను, కేసు షీట్లను, ఇతర సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వరంగల్ జిల్లాకు చెందినదని, ఆ జిల్లా వైద్య శాఖ అధికారికి పంపిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. అనంతరం ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌ను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ పీఓ ఎంహెచ్‌ఎన్ డాక్టర్ విరాజిత, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, లోక్యా, ప్రశాంత్, మనోహర్ పాల్గొన్నారు.


