విధులకు వెళ్తూ మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

విధులకు వెళ్తూ మృత్యుఒడికి..

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

అదుపు తప్పిన బైక్‌.. రెవెన్యూ ఉద్యోగి మృతి

వర్ధన్నపేటలో ఘటన

వర్ధన్నపేట: విధులకు వెళ్తూ ఓ రెవెన్యూ ఉద్యోగి మృత్యుఒడికి చేరాడు. బైక్‌ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట తహసీల్‌ కార్యాయం చైన్‌మెన్‌ బుంగ వెంకటనర్సు(55) బైక్‌పై తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పట్టణానికి వచ్చి విధులు ముగించుకున్నాడు. తిరిగి తహసీల్‌ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటనర్సు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement