● మేడారంలో ఘటన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేడారం సమీపం రెడ్డిగూడేనికి చెందిన వల్లేపు జానకీరామ్ (20) మేడారంలో సోడా బండి నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సోడా బండిలోని ఫ్రిడ్జ్‌లో నీరు చల్లబడేందుకు విద్యుత్ సరఫరా కోసం కరెంట్ తీగలకు వైరు తగిలించి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి బండిని పట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తీగకు అతుకులు ఏర్పడిన కారణంగా సోడా బండికి విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్లాపూర్ ఎస్సై కమలాకర్ తెలిపారు.


