టెస్కోతోనే నేత ఉత్పత్తులు కొనాలి | - | Sakshi
Sakshi News home page

టెస్కోతోనే నేత ఉత్పత్తులు కొనాలి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

మంత్రి తుమ్మలకు మాజీ మేయర్‌ వినతి

కాశిబుగ్గ: చేనేత కార్మికుల ఉపాధి కోసం టెండర్‌ విధానాన్ని రద్దు చేసి, చేనేత ఉత్పత్తులన్నీ టెస్కో ద్వారానే కొనాలని కోరుతూ.. రాష్ట్ర చేనేత జౌళి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వరరావును వరంగల్‌ మాజీ మేయర్‌ గుండు సుధారాణి కోరారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. చేనేత ప రిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది చేనేత కార్మికులు జీవిస్తున్నారని, ముఖ్యంగా వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో వేలాది మంది నేత కార్మికుల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చేనేత ఉత్పత్తులపై టెండర్‌ విధా నం అమలు చేయడం, టెస్కో ద్వారా నేరుగా కొనుగోళ్లు లేకపోవడం వల్ల సంఘాల్లో చేనేత ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయని, కార్మికులు ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈనెల 1 నుంచి వరంగల్‌లో కార్మికులు మగ్గాలను బంద్‌ చేసి దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం టెండర్‌ విధానం కాకుండా గతంలో ఉన్న టెస్కో ద్వారా నేరుగా కొని, ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేసి, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.

రాష్ట్రస్థాయి పద్య పఠన పోటీలు

జూలై 20వతేదీ లోపు ఎంట్రీలు పంపాలి

హన్మకొండ కల్చరల్‌/గీసుకొండ : రాష్ట్ర స్థాయి పౌ రాణిక పద్యనాటక, పద్య పఠన పోటీల కోసం ఆసక్తిగల వారు జూలై 20వ తేదీ లోపు తమ ఎంట్రీలు పంపాలని కళాపిపాసి సదానందాచారి సాంస్కృతిక సేవా ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మారేడోజు స దానందాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. తమట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పా ల్గొనే వారు పద్యనాటకంలోని ఏదైనా పాత్రకు సంబంధించిన ఐదు పద్యాలు, ఐదు రాగాలతో భావయుక్తంగా 12 నిమిషాలకు మించకుండా పాడేవారై ఉండాలన్నారు. ఈ రంగంలో ప్రఖ్యాతి చెందిన వారు, అనేక ప్రదర్శనలు ఇచ్చిన వారు పోటీల్లో పా ల్గొనొద్దని, కొత్తవారికి, చూడకుండా, తప్పులు లేకు ండా పాడేవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు ఆధార్‌ జిరాక్స్‌, వయస్సు,సెల్‌ నంబర్‌, పాడే నాటకం పేరు, అందులోని ఏ పాత్ర పద్యాలు పాడుతారో తెలుపుతూ, ఐదు పద్యాలు, వాటి ఐదు రాగాల పేర్లను రాసి వాట్సాప్‌ ద్వారా తమకు పంపాలన్నారు. హార్మోనియం లేకుండా ఐ దు పద్యాలను ఐదు రాగాల్లో పాడిన వీడియోను త మకు వాట్సాప్‌ చేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతోపాటు ప్రోత్సాహ క బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి గల వా రు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి మారేడోజు కేశవ (సెల్‌ 93475 10237)కు వాట్సాప్‌ ద్వారా ఎంట్రీలు పంపించాలని, వివరాలకు ఆయనను సంప్రదించాలని కోరారు. పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని పాల్గొనే వారికి త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement