వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

దామెర: వాటర్‌ ట్యాంకర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్‌ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లికి చెందిన నక్క బాలయ్య (40) లారీపై హనుమకొండ నుంచి గూడెప్పాడ్‌ వైపునకు వెళ్తూ ఊరుగొండ వద్ద మొక్కలకు నీరు పడుతున్న వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ ముసూఫ్‌ కార్తీక్‌, క్లీనర్‌ గోపాల్‌కు తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్‌ రెడ్డి, ఎస్సై అశోక్‌ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్‌ సాయంతో వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న బాలయ్య మృతదేహాన్ని సీఐ సుధాకర్‌ రెడ్డి, ఎస్సై అశోక్‌ సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్‌లో ఎంజీఎం మార్చూరీకి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

అక్కడికక్కడే లారీ డ్రైవర్‌ మృతి..

ఇద్దరికి తీవ్ర గాయాలు

ఊరుగొండ వద్ద ఘటన

Advertisement
 
Advertisement
Advertisement