వాహనదారులు క్షేమంగా గమ్యస్థానం చేరాలి | - | Sakshi
Sakshi News home page

వాహనదారులు క్షేమంగా గమ్యస్థానం చేరాలి

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

గూడూరు: ద్విచక్రవాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేకంగా చేపట్టిన అరైవ్‌–అలైవ్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్‌లు అందించా రు. తర్వాత రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ప్లకార్డుల ప్రదర్శనతో గూడూరు సీఐ వినయ్‌కుమార్‌ వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించేలా చర్యలు చేపట్టామన్నారు. మండలంలో గాజులగట్టు, పొనుగోడులో పోలీసుల ప్రత్యేక దృష్టితో జీపీ పాలకవర్గం గ్రామంలోకి వచ్చే ప్రతీ ఒక్క వాహనదారుడు హెల్మెట్‌ ధరించాలనే నిబంధన మొదలు పెట్టి సక్సెస్‌ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత కొమ్మాలు, తహసీల్దార్‌ నాగభవాని, ఎంపీడీఓ సత్యనారాయణ, నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ నరేష్‌రెడ్డి, ఆర్టీఏ శంకర్‌నాయక్‌, ఎస్సై గిరిధర్‌రెడ్డి, ఏఓ అబ్దుల్‌మాలిక్‌, ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు, ఉప సర్పంచ్‌ స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఎస్పీ శబరీష్‌

Advertisement
 
Advertisement
Advertisement