అధిక ధరలను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలను నియంత్రించాలి

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

మహబూబాబాద్‌: అధిక ధరలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. 12 ఏళ్ల మోదీ పాలనలో వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌తో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి పేదలపై భారం పడిందన్నారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌తో కొంతమంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్నారని, అందుకు సంబంధిత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు అజయ్‌సారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీని వాస్‌, పెరుగు కుమార్‌, నవీన్‌, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, పాండురంగాచారి, వెంకన్న, నా గేశ్వర్‌రావు, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement