చాపకింద నీరులా.. | - | Sakshi
Sakshi News home page

చాపకింద నీరులా..

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2026

నెహ్రూసెంటర్‌: జీవనశైలిలో మార్పుల వల్ల జిల్లాలో బీపీ, షుగర్‌ వ్యాధుగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతో ంది. పట్టణాల్లో కనిపించే వ్యాధులు ఇప్పుడు పల్లెల్లో సైతం విస్తరిస్తూ కలవరపెడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ప్రధాన కారణమవుతున్నా యి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ రీస్క్రీనింగ్‌ పేరుతో బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వంటి పరీక్షలను నిర్వహిస్తూ వారి వివరాలను నమోదు చేస్తున్నారు. బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు జిల్లాలో 50వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. అలాగే క్యాన్సర్‌, లెప్రసీ వంటి వ్యాధులను గుర్తిస్తూ వైద్యం అందిస్తున్నారు.

విస్తరణ ఇలా..

జిల్లాలో చాపకిందనీరులా బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వ్యాధుల విస్తరణ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన వారు సైతం ఈ వ్యాధులు బారిన పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. మూడున్నర లక్షలకుపైగా 30 ఏళ్లపైబడిన వారిని పరీక్షించగా 50 వేల మంది షుగర్‌, బీపీ, ఇతర వ్యాధులతో బాధపడుతుండడం ఆశ్చర్యం కలిగి స్తోంది. ప్రతీరోజు వ్యాయామం చేస్తూ శారీక శ్రమ, ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 6 నెలలకు ఓసారి వైద్య పరీక్షలు చేయించుకుని అందుకు తగినట్లు జీవన విధానంలో మార్పులు చేసుకో వడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలుపుతున్నారు.

ఒత్తిడి, ఆహారపు అలవాట్లు..

ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడంతో పాటు ఆహారపు అలవాట్లు బీపీ, షుగర్‌ వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ప్రతీరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అవగాహన లేక, నిర్లక్ష్యంతో వ్యాధుల బారిన పడుతున్నారు.

30 ఏళ్లు పైబడిన వారికి రీ స్క్రీనింగ్‌..

జిల్లాలో 30ఏళ్లు పైబడిన వారందరిని వైద్యారోగ్యశాఖ సిబ్బంది రీస్క్రినింగ్‌ ద్వారా సర్వే చేపడుతున్నారు. జిల్లాలో మొత్తంగా 30 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 3,92,894 ఉండగా ఇప్పటి వరకు 2,75,968 మందికి సర్వే నిర్వహించారు. సర్వే ద్వారా బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వంటి బాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వేలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.

ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి

ప్రజలందరూ తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా క్రమం తప్పకుండా ఉచితంగా అందజేస్తారు. సర్వేలు, పరీక్షలు నిర్వహిస్తున్న వెద్య సిబ్బందికి సహకరించాలి. ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నాం.

– రవిరాథోడ్‌, డీఎంహెచ్‌ఓ

బీపీ, షుగుర్‌ వ్యాధుల విస్తరణ

జిల్లాలో 50వేల మందికి పైగా బాధితులు

30ఏళ్లు పైబడిన వారికి వైద్య పరీక్షలు

మారుతున్న జీవనశైలి వల్లే వ్యాధుల వ్యాప్తి

Advertisement
 
Advertisement
Advertisement