వెంకటాపురం(ఎం): సినిమా షూటింగ్‌లకు ములుగు జిల్లా అనువైన ప్రాంతమని సినీ దర్శకుడు నేరెళ్ల దేవేందర్ అన్నారు. షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నెం. 2’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను బుధవారం మండలంలోని అందుగులమీది ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు ప్రాంతంలో సినిమా చిత్రీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అందుగులమేది గ్రామ పరిసర ప్రాంతాల్లో ఓ మంచైపె హీరోహీరోయిన్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ వేణు యాదవ్, కోడైరెక్టర్ అరవింద్, లిరిక్స్ రైటర్ రాజ్ కుమార్, మూవీ ఎడిటర్ యూనిక్, డీఓపీ తరుణ్, అసిస్టెంట్ డైరెక్టర్ లోకేశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతమ్, యూనిట్ సభ్యులు సిద్ధు, రఘు, రాహుల్, రఘుపతి, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
సినీ దర్శకుడు నేరెళ్ల దేవేందర్
అందుగులమేది ప్రాంతంలో సినిమా చిత్రీకరణ


