● సీకేఎం ఆస్పత్రికి తరలింపు.. తల్లీబిడ్డ క్షేమం
కాశిబుగ్గ: బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ రైలులో ప్రయాణిస్తున్న అర మంజుల అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండగా, 108 సిబ్బంది వెళ్లి ప్రసవం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్‌లో రైలు ఆపిన తర్వాత గర్భిణి సమాచారం తెలుసుకున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పెలట్ అమర్‌లు అక్కడికి చేరుకున్నారు. ఆమె పరిస్థితి గమనించి, రైలులోనే ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం ఇద్దరిని వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, వెంటనే స్పందించిన 108 సిబ్బందిని రైల్వే అధికారులు అభినందించారు.
● నలుగురికి గాయాలు
కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని 36వ డివిజన్‌లో వీధి కుక్కల బెడద స్థానికులను భయపెడుతోంది. మంగళవారం రాత్రి సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కాంపెల్లి వరమ్మ, రేణుకుంట్ల రమేష్, మహ్మద్ తాహి, గౌనియాలపై దాడి చేయగా వారికి గాయాలయ్యాయి. వీరు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.


