ఖిలా వరంగల్: రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ మధ్యలో పడి ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సెకండ్ ప్లాట్‌ఫామ్‌పై చోటు చేసుకుంది. జీఆర్ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ చిలకగూడ ప్రాంతానికి చెందిన పుప్పాల ధరణి (30) వరంగల్‌లోని తల్లి భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు వెళ్లేందుకు తల్లి భాగ్యలక్ష్మి, కూతురు ధరణి వరంగల్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఇద్దరు కలిసి రైలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలో ధరణి ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ మధ్యలో పడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్. రవీందర్‌రెడ్డి తెలిపారు.
● ప్లాట్‌ఫామ్ మధ్యలో పడి మహిళ దుర్మరణం
● వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఘటన


