బంధువుల ఇంటికి వెళ్తూ మృత్యుఒడికి | - | Sakshi
Sakshi News home page

బంధువుల ఇంటికి వెళ్తూ మృత్యుఒడికి

Mar 12 2026 8:30 AM | Updated on Mar 12 2026 8:30 AM

చిల్పూరు: బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. లారీ.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో భార్య దుర్మరణం చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం జనగామ జిల్లా చిల్పూరు మండంలం వంగాలపల్లి–కరుణాపురం బస్టాప్‌ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎసై నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఇదే జిల్లా దేవరుప్పుల మండలం పడమటితండాకు(పెద్దతండా) చెందిన గుగులోత్‌ దాసు, కమలమ్మ (45) దంపతులు బైక్‌పై కాజీపేటలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి బయలు దేరారు. ఈ క్రమంలో వంగాలపల్లి బస్టాప్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కమలమ్మ, దాసు దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న 108 వాహనం ఘటనాస్థలికి చేరుకున్న వెంటనే ఈఎంటీ హరికృష్ణ, పైలట్‌ రాజన్న చికిత్స చేసుకుంటూనే వరంగల్‌ ఎంజీఎం తరలించారు. అక్కడ ఇద్దరికి చికిత్స అందిస్తుండగా కమలమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు అనిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి..

భర్తకు తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement