తెలంగాణ ఉద్యమాన్ని | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమాన్ని

Mar 12 2026 8:30 AM | Updated on Mar 12 2026 8:30 AM

విమర్శించే వారే ఎక్కువ

మొదలుపెట్టింది ‘పీపుల్స్‌వార్‌’

వెంకటాపురం(ఎం): తెలంగాణ సాయుధ పోరాటాన్ని మలిదశ ఉద్యమంగా మొదలుపెట్టింది పీపుల్స్‌వార్‌ పార్టీనేనని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి మండలంలోని స్వగ్రామమైన నర్సింగాపూర్‌కు బుధవారం చేరుకున్న ఆశన్నకు గ్రామస్తులు, బాల్యమిత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశన్న అందరిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆశన్న విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌ డిక్లరేషన్‌తో మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో పలువురు భాగస్వాములు అయ్యారని వెల్లడించారు. మళ్లీ ఈ నేల మీద(నర్సింగాపూర్‌లో) అడుగు పెడతానని ఊహించలేదని, తన తండ్రి భిక్షపతిరావు కుటుంబం కంటే గ్రామం కోసమే ఎక్కువ ఆలోచించేవారని గుర్తుచేశారు. గ్రామంలో సూర్యనేని సత్తన్నను నక్సలైట్లు అంతిరెడ్డి హయాంలో చంపితే వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలిపారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా మాట్లాడితే తనపై పోస్టర్లు వేసిన సందర్భాలు గుర్తు ఉన్నాయన్నారు. ఎంత శత్రువైనా నమ్మి వచ్చినవాళ్లకు ఎలాంటి హానితలపెట్టలేదన్నారు.

ప్రజాక్షేత్రంలోనే ఉంటాం..

ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాల్లో వదిలామని, ప్ర జాక్షేత్రంలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని ఆశన్న తెలిపారు. ప్రజలను సంఘటితం చేయడమే లక్ష్యమన్నారు. సమాజ మార్పుకోసం పదవులు అవసరం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురై ఓటేసి గెలిపిస్తే ఖర్చుచేసిన ప్రజాప్రతినిధులు రెండింతలు, నాలుగింతలు, పదింతలు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. నేటి యువతరం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదని, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రశ్నించేతత్వాన్ని పెంచుకోవాలన్నారు.

ఒకప్పుడు నక్సలైట్లకు

వ్యతిరేకంగా పోరాడా

ఆయుధాలు అవసరం లేదు..

ప్రజల్లో చైతన్యం నింపాలి

మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆశన్న

మావోయిస్టుల్లో ఉండి ప్రజల కోసం పనిచేసినా, లొంగిపోయి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పనిచేసినా విమర్శించే వారే ఎక్కువని ఆశన్న పేర్కొన్నారు. మావోయిస్టులు ఉంటే లొంగి పోవాలన్నారు. లొంగిపోయి బయటకు వస్తే మళ్లీ వారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సమాజంలో అడ్వాన్స్‌, తటస్థం, వెనక్కిలాగే మనుషులు ఉంటారని పేర్కొన్నారు. ప్రజల కోసం అడ్వాన్స్‌, తటస్థం ఉన్న మనుషులతోనే కలిసి ముందుకు వెళ్తామని, నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ఆశన్న స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement