ప్రతీ విద్యార్థి దస్తూరిపై దృష్టి సారించాలి. అక్షరం ఆకట్టుకునేలా ఉంటే విజయం విద్యార్థి వెంటే ఉంటుంది. సామాన్య శాస్త్రంలో బొమ్మలు గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో క్రమపద్ధతి పాటించాలి. స్కెచ్‌లు, పలు రంగుల పెన్నులను అడ్డదిడ్డంగా ఉపయోగిస్తుంటారు. ఇది సరికాదు. జవాబుల్లో ముఖ్యమైన పదాలు ఉండేలా చూడాలి. క్రమ పద్ధతి పాటించడం, అక్షరాలు, పదాలు, వాక్యాల మద్య తగినంత దూరం ఉండేలా పేజీకి 16 నుంచి 18 వరుసలు మించకుండా రాయాలి. సమాధానం ఆకట్టుకునేలా ఉంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
– బొజ్జ సురేశ్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, (చేతిరాత నిపుణుడు)


