మరిపెడ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం అరకు నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.4.20 లక్షల విలువైన 8 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం మహబాబాబాద్ జిల్లా మరిపెడలో చోటుచేసుకుంది. మరిపెడ సీఐ రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు మరిపెడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్‌గాంధీ చౌరస్తాలో టాస్క్ ఫోర్స్ సీఐ హథీరాం, మరిపెడ అదనపు ఎస్సై కోటేశ్వర్‌రావు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఐదుగురు యువకులు బైక్‌తో అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా సుమారు 8 కిలోల ఎండు గంజాయి లభించింది. దీంతో మరిపెడకు చెందిన లూనావత్ ప్రవీణ్, బోడ కార్తీక్, బానోత్ శివ, గార్ల మండలానికి చెందిన మూడు అభిషేక్, మరొకరు బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మరిపెడ పీఎస్‌కు చెందిన ఉమామహేశ్వర్‌రావు, సాయికిరణ్, నరేశ్, శ్రీనివాస్, గణేశ్, నాగేశ్వర్‌రావును సీఐ రాజ్‌కుమార్ అభినందించారు.
కురవిలో రూ.75వేల విలువైన 1.5 కేజీలు..
కురవి: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కురవి రెండో ఎస్సై జయకుమార్ కథనం ప్రకారం.. కురవి రెండో ఎస్సై జయకుమార్ బుధవారం తన సిబ్బందితో కలిసి 365 జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై అనుమానాస్పదంగా కనిపించి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.వెంటనే పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగులో రూ.75వేల విలువైన 1.5 కేజీల గంజాయి లభించింది. దీంతో మహబూబాబాద్ మండలం తూర్పుతండా గ్రామానికి చెందిన ఆంగోత్ రాములు, కురవికి చెందిన కట్ల ఉమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు రెండో ఎస్సై జయకుమార్ తెలిపారు. కాగా, రెండో ఎస్సై జయకుమార్, సిబ్బంది వెంకటయ్య, సమ్మయ్య, కాశీరాం, పుష్పలతను ఎస్పీ శబరీశ్, డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య అభినందించారు.
ఐదుగురు యువకుల అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన పోలీసులు


