విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నా నో టెక్నాలజీపై సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. నానోకణాలు , గ్రీన్‌నానో టెక్నాలజీ –సంశ్లేషణ విశ్లేషణ వినియోగాలు అనే అంశంపై ఈ సర్టిఫికెట్ కో ర్సు ద్వారా విద్యార్థులకు గ్రీన్ టెక్నాలజీ ప్రాథమిక సూత్రాలు, బయోటెక్నాలజీలో వినియోగాల గురించి అవగాహన కల్పించటమే లక్ష్యంగా ఉందని ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. సమావేశాని3కి వరంగల్ నిట్ బయోటెక్నాలజీ విబాగం అసోసియేట్ ప్రొఫెసర్ పెరుగు శ్యాం ముఖ్యఅతిథిగా పాల్గొని నానోటెక్నాలజీలో వస్తున్న మార్పులు, సూక్ష్మజీవ శాస్త్రంలో ప్రాముఖ్యతపై వివరించారు. డాక్టర్ ఆదిత్య రిసోర్స్ పర్సన్‌గా విద్యార్థులతో చర్చిస్తూ నానోటెక్నాలజీలో ఉన్నపరిశోధనా అవకాశాల గురించి తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ జిసుహాసిని, మైక్రోబయాలజీ విభాగం ఆర్డినైజింగ్ సెక్రటరీ డాక్టర్ రేణుక పాల్గొని మాట్లాడారు.


