సమగ్ర రిపోర్ట్ వచ్చాకే బిల్లుల చెల్లింపు
వరంగల్ అర్బన్: సమగ్ర రిపోర్ట్ అనంతరమే బిల్లులు చెల్లిస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. గురువారం బల్దియా పరిధి 44వ డివిజన్‌లో శానిటేషన్ ఇంజనీరింగ్ పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 44వ డివిజన్ భట్టుపల్లిలో నిర్మాణం పూర్తి చేసిన సీసీ రోడ్ల బిల్లుల చెల్లింపు కోసం కమిషనర్ కొలతలు వేసి పరిశీలించారు. మొత్తం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత తనిఖీలు చేపట్టాలని, సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాతే బిల్లు తీసుకురావాలని కమిషనర్ అధికారులకు సూచించారు. అనంతరం అమ్మవారిపేటలో చిన్న మేడారం జాతర జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. గద్దెల ప్రాంతంలో లైటింగ్ తదితర ఏర్పాట్లను బల్దియా తరఫున చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్‌ఎస్‌టీపీ ప్రాంతంలో 150 కేఎల్‌డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్లాంట్‌ను ప్రత్యక్షంగా పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శాయంపేటలోని ఆర్–1 రోడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ రవికుమార్, డీఈ రవికిరణ్, ఏఈ రామన్న, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్


