ముచ్చటగా మూడోసారి!
మహబూబాబాద్: మానుకోట.. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. త్వరలో మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో నాయకులు సవాల్‌గా తీసుకున్నారు. గత ఎన్నికల్లో వార్డుల సంఖ్య పెరుగగా.. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్‌గా.. మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థి చైర్మన్ కాగా.. మూడోసారి ఆ పీఠంపై రెండు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కాగా, ఈనెల 10ను తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. దానిని ఈనెల 12వ తేదీకి ఎన్నికల సంఘం అధికారులు మార్చారు.
2014లో మొదటిసారి ఎన్నికలు..
మానుకోట మేజర్ గ్రామపంచాయతీ 2011 అక్టోబర్ 3న మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. 2011 అక్టోబర్ 3వ తేదీ నుంచి 2014వరకు ఇన్‌చార్జ్ పాలన సాగింది. 2014 మే నెలలో ఎన్నికలు జరుగగా.. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్–సీపీఐ పొత్తు పెట్టుకోగా.. కాంగ్రెస్ ఒంటరిగా.. సీపీఎం–టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాగా, కాంగ్రెస్‌కు 7, బీఆర్‌ఎస్‌కు 7, సీపీఎం 5, సీపీఐ 3, టీడీపీ 3, స్వతంత్రులు 3 వార్డుల్లో గెలుపొందారు. చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్య ఉమా మురళీనాయక్, వైస్ చైర్మన్‌గా సీపీఎం అభ్యర్థి సూర్నపు సోమయ్య బాధ్యతలు స్వీకరించారు. 2019 జూలై 3న పాలక మండలి గడువు ముగిసింది.
2020లో ఎన్నికలు..
రెండోసారి 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరుగగా.. అదే నెల 25న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. ఈమేరకు బీఆర్‌ఎస్ 19, కాంగ్రెస్ 10, సీపీఐ 2, సీపీఎం 2, స్వతంత్రులు 3వార్డుల్లో గెలుపొందారు. చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వ్ కావడంతో అదే నెల 27న చైర్మన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, అదే పార్టీకి చెందిన వైస్ చైర్మన్‌గా మహ్మద్ ఫరీద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత మధ్యలో వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టగా.. ఆ పార్టీకే చెందిన మార్నేని వెంకన్న వైస్ చైర్మన్ అయ్యారు.
12న ఓటరు తుది జాబితా..
త్వరలో మానుకోట మున్సిపాలిటీ
ఎన్నికలు
గత ఎన్నికల్లో పెరిగిన వార్డులు..
ప్రస్తుతం పెరిగిన ఓటర్లు
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్
చైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ
ఈనెల 12న తుది ఓటరు జాబితా
త్వరలో మూడోసారి..
జిల్లాలోనే అతిపెద్దదైన మానుకోట మున్సిపాలిటీపై అందరూ దృష్టి పెట్టారు. ప్రస్తుత్తం 36 వార్డులు ఉండగా.. ఈనెల 1న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 65,851 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 57,828 మంది ఓటర్లు ఉండగా 8,023 మంది పెరిగారు. కాగా, ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం కావడంతో ఆ పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, చైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల12న ఓటరు తుది జాబితా విడుదల చేసిన తర్వాత ఎన్నికల కోలాహలం మొదలవ్వనుంది. ఇప్పటికే పార్టీల వారీగా ముఖ్య నా యకులతో సమావేశాలు నిర్వహించి, వార్డుల వా రీగా ఆశావహుల వివరాలు తీసుకుంటున్నారు.
ఓటరు జాబితా హెడ్యూల్ ప్రకారం ఈనెల 10న ఓటరు తుది జాబితా తయారు చేసి ప్రదర్శించాలి. కాగా బుధవారం మళ్లీ విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఈనెల 12న ఓటరు తుది జాబితా ప్రదర్శించనున్నట్లు అధికారులు చెప్పారు. మున్సిపల్ చట్టం–2019లో సవరించిన సెక్షన్–195ఏ ప్రకారం వార్డుల వారీగా ఓటరు తుది జాబితా ప్రదర్శిస్తా రు. 13న పోలింగ్ స్టేషన్‌ల వివరాల ముసాయిదా జాబితా, 16న పీఎస్ వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ప్రదర్శించాలని ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ముచ్చటగా మూడోసారి!


