విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
● సీఎం కప్ టార్చ్ ర్యాలీలో
ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే మురళీనాయక్ ముఖ్యమంత్రి కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రాజేశ్వర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జ్యోతి, క్రీడాకారులు పాల్గొన్నారు.


