గొర్రెల కాపరులపై హైనా దాడి?
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్ గ్రా మంలో హైనా దాడిలో పలువురు గొ ర్రెల కాపరులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బింగి అయిలయ్య, చిమ్మ సాయిలు, ఒగ్గు కొండయ్య, పైస బాల మల్లయ్య.. రోజూ మాదిరిగానే జీవాలను ఉదయం మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కిట్టమ్మ కుంట ఏనె దగ్గర హైనాను పోలిన జంతువు ఒకే సారి దాడి చేసింది. వరుసగా వస్తున్న నలుగురుపై గంట వ్యవధిలో దాడి చేయగా వారికి పలు చోట్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులను బచ్చన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి పంపించారు. కాగా, ఆ జంతువు.. జీవాలపై కూడా దాడి చేసిందని గొర్రెల కాపరులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకర జంతువుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రామచంద్రాపూర్‌లో ఘటన
భయాందోళనలో గ్రామస్తులు


