విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జనగామ సర్కిల్ రఘునాథపల్లి సబ్ డివిజన్ నర్మెట సెక్షన్‌లో పనిచేస్తూ మృతి చెందిన అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ బానోత్ రాజు సతీమణి నీలకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి చెందిన బీమా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా నీలకు ఉద్యోగం కల్పించాలని సీఎండీని కోరగా సానుకూలంగా స్పందించారని విద్యుత్ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి .తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, ఎస్‌ఈలు, తదితరులు పాల్గొన్నారు.


