డెడ్‌లైన్‌ టెన్షన్‌.. | - | Sakshi
Sakshi News home page

డెడ్‌లైన్‌ టెన్షన్‌..

Dec 31 2025 7:30 AM | Updated on Dec 31 2025 7:30 AM

డెడ్‌

డెడ్‌లైన్‌ టెన్షన్‌..

సమీపిస్తున్న గద్దెల పునర్నిర్మాణ పనుల గడువు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం పనుల డెడ్‌లైన్‌ సమీపిస్తుడడంతో అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. డిసెంబర్‌ 31 లేదా జనవరి 5వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, సీతక్క డెడ్‌లైన్‌ విఽధించిన విషయం తెలిసిందే. అలాగే, గద్దెల ప్రాంగణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ వారంలో నాలుగు దఫాలుగా పనులను పరిశీలించి డెడ్‌లైన్‌ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఏఈ నుంచి మొదలు.. కలెక్టర్‌ వరకు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ క్రమంలో గద్దెల పునర్నిర్మాణ పనుల్లో కొన్ని పూర్తికాగా మరిన్ని డెడ్‌లైన్‌ నాటికి పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు.

సాలహారం పనుల పూర్తిపై అనుమానాలు

గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం రాతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో డెడ్‌లైన్‌ నాటికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వైపే ఈ పనులు పూర్తి కాగా మరో వైపు పిల్లర్ల స్థాయిలోనే ఉంది. ప్రహరీ నిర్మాణంతోపాటు 8 ఆర్చ్‌ల నిర్మాణం కోసం భారీ స్తంభాలను నిలిపారు. కానీ వాటిపై భీమ్‌లు నిలపడంతోపాటు ఆదివాసీ సంస్కృతి చిత్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐరన్‌ గేట్లను కూడా అమర్చాల్సి ఉంది. ఈ పనులేవీ నేటి వరకు కాలేదు. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్‌ అమర్చే పనులు పూర్తయ్యాయి. అయితే రాళ్ల మధ్యలో సిమెంట్‌ పూతల పనులు ఇంకా పూర్తి కాలేదు. అమ్మవార్ల గద్దెల విసర్తణ పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ కేవలం రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. పైన రాతి పిల్లర్లను నిలపడంతోపాటు గద్దెల చుట్టూ రాతి స్టోన్స్‌ డిజైన్ల ఏర్పాటు పనులు కూడా నేటి వరకూ కాలేదు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మీడియా పాయింట్‌ మంచెల పనులూ అంతే..

జాతరలో కవరేజ్‌ కోసం మీడియా పాయింట్‌ మంచెల నిర్మాణ పనులు ఇంకా స్లాబ్‌ స్థాయిలోనే జరుగుతున్నాయి. జాతరలో మీడియా కవరేజ్‌ కీలకం. గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా మీడియా కవరేజ్‌, అధికారుల పర్యవేక్షణ కోసం సాలహారానికి అవతల వైపు రెండు, ఇవతల వైపు రెండు చొప్పున మీడియా పాయింట్‌ మంచెలు నిర్మిస్తున్నారు. ఈ పనులు ఒక మంచె రెండో స్లాబ్‌ వేయగా, మిగతా మూడు మంచెల నిర్మాణం పనులు మొదటి స్లాబ్‌ దిశలోనే కొనసాగుతున్నాయి. జాతరకు ముందుగా మంచెల నిర్మాణ పనులు పూర్తికావడం అనుమానంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర గడువు సమీపిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో తొందరపాటుతో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాతరకు మిగిలింది 27 రోజులే.

మేడారం జాతరకు ఇంకా 27 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం, బుధ, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలొస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి భక్తుల సంఖ్య లక్షల్లో పెరగనుంది. ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్‌ మధ్యలో జీపీ సిమెంట్‌ పూయడంతో భక్తుల రద్దీ కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి

నిరంతరం మేడారం పనులను

పర్యవేక్షిస్తున్న అధికారులు

మహాజాతర నాటికి పూర్తయ్యేనా?

డెడ్‌లైన్‌ టెన్షన్‌.. 1
1/1

డెడ్‌లైన్‌ టెన్షన్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement