కామన్ మెస్‌లో అధిక బిల్లులు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కా మన్ మెస్‌లో బిల్లులు అధికంగా వచ్చాయని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం తినకుండా ఆందోళన చేపట్టారు. ఒక్కో విద్యార్థికి జూలై బిల్లు రూ. 2,178, ఆగస్టులో రూ. 2,435 చొప్పున వేశారు. ఈ బిల్లులను ఈనెల 29న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ ప్రదర్శించారు. ఆగస్టులో 8 నుంచి 20వ తేదీ వరకు సెలవుల సందర్భంగా మెస్ నడపలేదని, 18 రోజులకే ఒక్కో విద్యార్థికి రూ. 2,435 బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెల మొత్తం ఒక్కో విద్యార్థికి రూ. రూ.2వేల వరకు రావాల్సిండగా 18 రోజులకే ఎక్కువ బిల్లు రావడం ఏమిటని, అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న హాస్టళ్లడైరెక్టర్ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. జనవరి 3న రిజిస్ట్రార్ రామచంద్రం వద్ద ఈ బిల్లుల విషయంపై సమావేశం నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుపగా మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళన విరమించి విద్యార్థులు భోజనం తిన్నారు. కాగా, కామన్ మెస్ వద్ద విద్యార్థులతో జనవరి 3న సమావేశం నిర్వహించనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్‌ిపీ రాజ్‌కుమార్ మంగళవారం సర్క్యూలర్ జారీచేశారు. మెస్ బిల్లులు, మెస్‌లో మాల్‌ప్రాక్టీసెస్, టెండర్ నోటిఫికేషన్లపై చర్చించనున్నామని ఆయన పేర్కొన్నారు.
అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ
విద్యార్థుల ఆందోళన
రిజిస్ట్రార్‌తో సమావేశం ఏర్పాటు
చేస్తామన్న డైరెక్టర్


