రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో మంజూరు..
మానుకోటకు మరో మణిహారంగా వస్తుందని భావించిన రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో మంజూరుపై ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. రూ.908కోట్లు మంజూరు కాగా.. నిర్మాణానికి భూమి చూపించలేదనే నెపంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నష్కల్‌కు డిపో తరలివెళ్తుందనే ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మహబూబాబాద్ పట్టణంలోని అనంతారం సమీపంలో 409.01 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాసింది.


