బతుకుదెరువుకు వెళ్లి దుర్మరణం..
● ముంబయిలో లింగాలఘణపురం వాసి మృతి
● 20 అంతస్తుల భవనంపై
సీన్ బిల్లులు లెవల్ చేస్తుండగా ఘటన
లింగాలఘణపురం: బతుకుదెరువు నిమిత్తం ముంబయి వెళ్లిన జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన సుక్క సత్యనారాయణ (39) ఆదివారం రాత్రి 20 అంతస్తుల భవనంపై నుంచి పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సు మారు ఇరవై ఏళ్లుగా ముంబయిలో ఉంటున్న సత్యనారాయణ.. కూ లీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు వారీగా సత్యనారాయణ, రజిత దంపతులు తమ కుమారుడు చందుతో కలిసి ఘాట్‌కోపర్ ప్రాంతంలో ఒకే చోటకు సీన్ బిల్లలు పెట్టే పనికి వెళ్లారు. 20 అంతస్తులు భవనంపై సీన్ బిల్లులు పెట్టిన అనంతరం స త్యనారాయణ వాటిని లెవల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జరుగుతూ వెనుక ఉన్న ప్లంబింగ్ పైపులు వెళ్లే రంధ్రంలో పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రజిత, కుమారుడు చందు బోరున విలపించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించారు. ఇదిలా ఉండగా ఇరవై ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన దయ్యాల నర్సయ్య కూడా ముంబాయిలోనే కూలీ పని చేస్తూ దుర్మరణం చెందాడు. గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ వివిధ ఘటనల్లో చనిపోతుండడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి.


