కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట, వరంగల్ మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
జనవరి 8వ తేదీన కాకినాడ టౌన్–వికారాబాద్ (07460) వీక్లి ఎక్స్‌ప్రెస్ కాజీపేట, వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయన్‌పాడ్, ఖమ్మం, వ రంగల్, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 9, 11వ తేదీల్లో వి కారాబాద్–పార్వతీపురం (07461) వీక్లి ఎక్స్‌ప్రెస్, జనవరి 10వ తేదీన పార్వతీపురం–వికారాబాద్ (07462) వీక్లి ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట, వరంగల్ మీ దుగా ప్రయాణిస్తాయి. ఈ రైళ్లకు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్‌పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 8వ తేదీన సికింద్రాబాద్–పార్వతీపురం (07464) వీక్లి ఎక్స్‌ప్రెస్, జనవరి 9వ తేదీన పార్వతీపురం–సికింద్రాబాద్ (07465) వీక్లి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్‌పాడ్, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలిలో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సోమవారం నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
టిప్పర్ టైర్ల దొంగల అరెస్ట్
నర్సంపేట రూరల్ : టిప్పర్ టైర్లను అపహరిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట పీఎస్‌లో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. నర్సంపేట మండలం లక్నెపల్లికి చెందిన గొర్రె కృష్ణంరాజు గత నెల 10వ తేదీన గ్రామ శివారులోని ఇసుక డంప్ వద్ద టిప్పర్ నిలిపి ఉంచాడు. అర్ధరాత్రి దుండగులు ఆ టిప్పర్ నాలుగు టైర్లను అపహరించడంతో బాధితుడు నర్సంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం గురిజాల క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో బొలెరోలో నాలుగు టైర్లను గూడూరు నుంచి వరంగల్‌కు తరలిస్తుండగా పట్టుకుని టైర్లతోపాటు బొలెరో, బైక్‌ను స్వాధీనం చేసుకుని నలుగురు సోడా రాజశేఖర్, మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, బుడిగబోయిన ఉదయ్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు గూడ అరణ్, రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● భట్టుపల్లి రోడ్డులో ఘటన
ఖిలా వరంగల్: రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఓ బైక్.. ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని ఉర్సుగుట్ట భట్టుపల్లి రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (25) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం బైక్‌పై వరంగల్ వెళ్లి పని పూర్తయిన అనంతరం సాయంత్రం భట్టుపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో రెడీమిక్స్ ప్లాంట్ వద్ద కరీమాబాద్‌కు చెందిన గొట్టె కుమారస్వామి బైక్‌పై రాంగ్‌రూట్‌లో వచ్చి ప్రవీణ్‌యాదవ్‌ను ఢీకొనగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి బాషబోయిన ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు.
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు


