నేడు కేయూ పాలకమండలి సమావేశం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించనున్నారు. 11 అంశాలను పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. ప్రధానంగా కొంతకాలం క్రితం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా 46 మంది అధ్యాపకులకు ఇంట ర్వ్యూలు నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులకు సంబంధించి పాలకమండలి చర్చించి ఆమోదించనున్నారు. యూనివర్సిటీలో ఆరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు వెకెన్సీలుగా ఉన్నా యి. అయితే సూపరింటెండెంట్‌లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించేందుకు రాత పరీక్ష నిర్వహించాలా లేక సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలా అనే అంశం పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సూపరింటెండెంట్లకు రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాలని యూనివర్సిటీ అధికారులు యోచించగా దానిని సూపరింటెండెంట్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల వెకెన్సీలు చూపుతున్నారని సమాచారం.అయితే అందులో వివిధ విభాగాల్లోని వెకెన్సీల భర్తీ విషయంలో రోస్టర్ ఫిక్స్ చేసే అంశంపై కూడా పాలకమండలిలో చర్చించనున్నారని తెలి సింది. కేయూ ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లకు సంబంధించి మూడు ఎండోమెంట్ల లెక్చర్ల ఏర్పాటునకు ఇటీవలే పలవురు యూనివర్సిటీకి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున డబ్బులు చెల్లించారు. ఎండోమెంట్ లెక్చర్ల ఏర్పాటుకు కూడా పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పరీక్షల విభాగంలోని కాన్ఫిడెన్షియల్ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొనబోతున్నారు.
అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం లభించే అవకాశం!


