కలిసిరాని కాలం
సాగు హుషారు.. ‘మోంథా’తో బేజారు !
జిల్లాలో నూతన పంటల సాగు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ఈఏడాది మోంథా తుపానుతో పంటలకు కొంతమేర వాటిల్లింది. కానీ, భూగర్భజల మట్టం పెరగడంతో నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండాపోయింది. ఇదిలా ఉండగా.. పలువురు రైతులు వినూత్న పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు జిల్లాలో ఎవరూ సాగు చేయని పంటల సాగు ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా, జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 2,04,018 ఎకరాల్లో పంటల సాగు చేయగా.. ఖరీఫ్‌లో 4,22,641 ఎకరాల్లో పంటల సాగు జరిగింది.
అంతర పంటగా వక్క సాగు..
తొర్రూరు మండలంలోని గుర్తూరు, అమ్మాపురం గ్రామాల్లో, చిన్నగూడూరు మండలకేంద్రంలో ఈ ఏడాది కొత్తగా వక్క సాగును రైతులు ప్రారంభించారు. పామాయిల్ తోటల్లో అంతరపంటగా వక్క పంటను సాగు చేశారు.
మాకాడామియనట్ సాగు చేశా..
ఏడాది క్రితం రెండున్నర ఎకరాల్లో మాకాడామియనట్ పంటసాగు ప్రారంభించాను. దక్షిణాఫ్రికా నుంచి ఈ మొక్కలను కర్ణాటక రాష్ట్రంలోని శాస్త్రవేత్తల ద్వారా తెప్పించాను. ఒక మొక్క ఖరీదు రూ.1,600 వరకు ఉంటుంది. రెండున్నర ఎకరాల్లో 500 మొక్కలు నాటించాను. జిల్లా రైతులకు కొత్త పంటలను పరిచయం చేయాలనే ఆలోచనతో మాకాడామియనట్ సాగుకు సిద్ధమయ్యాను. మాకాడామియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి, కాంఫెక్షనరీ ఉత్పత్తుల్లో, వివిధ రకాల క్రీములు, లోషన్లు, నూనె, షాంపూల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
– మాధవపెద్ది వినిల్‌రెడ్డి, రైతు, అప్పరాజుపల్లి
ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు ఇలా (ఎకరాల్లో)..
అంచనా : 15,65,250
సాగైంది : 15,82,755
వరి అంచనా : 85,8376
సాగైంది : 8.15 లక్షలు
పత్తి సాగు అంచనా : 5,79,863
పత్తి సాగైంది : 5,83,219
వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల్లో
ఉమ్మడి జిల్లాలో నష్టం ఇలా..
మొత్తం రైతులు : 1,29,228
ఎకరాలు : 2.16 లక్షలు
రైతులను వెంటాడిన ప్రకృతి వైపరీత్యాలు
తుపానుతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు
ధీమా ఇవ్వని ‘బీమా’.. ఇంకా చేతికందని పరిహారం
పెరిగిన వాణిజ్య పంటల సాగు...
వరి, పత్తి తర్వాతే పప్పు దినుసులు
రైతులకు తప్పని ఎరువుల కొరత..
వరి, పత్తికి దక్కని మద్దతు ధర
ఒడిదుడుకుల మధ్య సాగిన వ్యవసాయం
కలిసిరాని కాలం
కలిసిరాని కాలం
కలిసిరాని కాలం


