జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Dec 29 2025 8:46 AM | Updated on Dec 29 2025 8:46 AM

జాతీయ

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

గార్ల: రాజస్థాన్‌లో జనవరి 2 నుంచి జరిగే జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు అండర్‌–19 విభాగంలో తెలంగాణ టీంలో గార్లకు చెందిన పిల్లలమర్రి వెంకటసాయి ఎంపికయ్యారు. గార్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న వెంకటసాయి జాతీయస్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక కావడంపై గార్ల సీహెచ్‌సీ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ జాదవ్‌, ఆయనను శాలువాతో సన్మానించి రాజస్థాన్‌ వెళ్లేందుకు ఆర్థికసహాయం అందించారు. వార్డుసభ్యులు తోడేటి శ్రీనుగౌడ్‌, ఇస్లావత్‌ రావూజీ, ఎస్‌కే యాకూబ్‌పాషా, వేశమల్ల రాజశేఖర్‌, ఈశ్వర్‌లింగం, గోపాల్‌రెడ్డి, నవీన్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరాలయంలో భక్తుల సందడి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయంలో మహిళలు పూజలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది.

జంపన్నవాగులో బస్తాలతో అడ్డుకట్ట

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జంపన్నవాగులో నీటి లభ్యత కోసం ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇసుక బస్తాలతో అడ్డుకట్ట పనులు చేపట్టారు. మేడారం భక్తులు పుణ్యస్నానాల కోసం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం నీటిని విడుదల చేస్తారు. నీటి లభ్యతగా ఉండేలా వాగులో తొమ్మిది ప్రదేశాల్లో బస్తాల్లో ఇసుక నింపి వాగుకు అడ్డుకట్టగా వేస్తున్నారు. నీరు నిల్వ ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.

చట్ట సభల్లో ప్రస్తావించాలి

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్‌ దేవుళ్లపల్లి రాఘవేందర్‌, చైర్మన్‌ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్‌ అప్రెంటీస్‌ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరా రు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేట ర్లు జక్కుల రవీందర్‌యాదవ్‌, విజయశ్రీ రజా లి, జలగం రంజిత్‌రావు, సంపత్‌రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

బస్టాండ్‌ పనుల్లో నిర్లక్ష్యం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం ఆర్టీసీ బస్టాండ్‌లో భద్రాచలం, కొత్తగూడెం క్యూలైన్‌ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జాతర సమయంలో కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతర సమయం దగ్గరపడుతున్న తరుణంలో క్యూలైన్లపై తడుకల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు నీడ కోసం పలుచటి తడుకలను ఏర్పాటు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక
1
1/1

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement