అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్
మహబూబాబాద్ రూరల్ : అభివృద్ధికి మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్‌లో ఆవిర్భవించిందన్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరకు త్యాగాలతో కూడిన సేవలను భారతదేశానికి గాంధీ, నెహ్రూ కుటుంబాలు అందించాయన్నారు. టీపీసీసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోతు వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, కాటా భాస్కర్, లింగాల వీరభద్రంగౌడ్, పోతరాజు రాజు, లక్ష్మి, సత్యమనోరమ, చెన్నూరి విజయలక్ష్మి, విజయ, చెన్న సీతారాములు, ఎండి.హారుణ్, ఖలీల్, గపూర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మురళీనాయక్
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం


