అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా..
● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
డోర్నకల్/మరిపెడ: రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పని చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డోర్నకల్‌లో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, రూ.20 కోట్లతో చేపడుతున్న ట్యాంక్ బండ్ పనులు, రూ.8 కోట్లతో నిర్మిస్తున్న డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బిషప్ ఈజరయ్య ఫంక్షన్ హాల్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో రూ.6.50 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు, వర్షపు నీటికాల్వ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు నెహ్రూనాయక్, నర్సింహమూర్తి, మున్సి పల్ కమిషనర్ నిరంజన్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, హనుమ, గంగా ధర్ తదితరులు పాల్గొన్నారు.


