డ్రమ్ సీడర్ పద్ధతి ఎంతో మేలు
గత నాలుగు సంవత్సరాల నుంచి 4 ఎకరాల్లో డ్రమ్ సీడర్ పద్ధతిన వరి సాగు చేస్తున్నా. ఈ విధానంలో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాను. కూలీలతో ఎక్కువగా అవసరం ఉండదు. కూలీలతో సాగు విధానంలో ఎకరాకు 22 నుంచి 25 క్వింటాలు వస్తే, డ్రమ్ సీడర్ విధానంలో 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
– రూపురెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు, గూడూరు
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి
డ్రమ్ సీడర్ విధానం వరి సాగులో ఎంతో మేలు. కూలీల పని తక్కువగా ఉంటుంది. ఖర్చు, కూలీల పని తగ్గుతుంది. మొదటిసారి దిగుబడి అనుకున్నంత రాకున్నా, రెండో సారికి దిగుబడి సాధించవచ్చు. ఈ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో, ఈ సంవత్సరం చాలా చోట్ల రైతులు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేస్తామంటున్నారు.
– అబ్దుల్‌మాలిక్, ఏఎఓ, గూడూరు
డ్రమ్ సీడర్ పద్ధతి ఎంతో మేలు


