రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు

Dec 28 2025 8:36 AM | Updated on Dec 28 2025 8:36 AM

రెండే

రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు

మహబూబాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆగం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివర్శించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత అధ్యక్షత వహించగా కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను తిట్టడం, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మానుకోట, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో ఎవరికీ బీ ఫాం ఇస్తే వారిని గెలిపించాలన్నారు. కమీషన్ల రూపంలో ప్రజాధనమంతా ఢిల్లీకి పోతుందన్నారు. అధికార పార్టీ ఆగడాలు, ఆరాచకాలు చేసినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరోచిత పోరాటం చేసి గెలిచారన్నారు. గ్రామపంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బ, అయ్యా సొమ్ము కాదని, రాజ్యాంగ హక్కున్నారు. రాష్ట్రాన్నికి సీఎం ఎలాగో గ్రామానికి సర్పంచ్‌ అలా అన్నారు. ఢిల్లీకి మూటలు, సంచులు, చెప్పులు మేసే సన్నాసి రేవంత్‌రెడ్డి అన్నారు. 500 జనాభా ఉన్న తండాలను జీపీలను చేయడంతో పాటు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్‌ పది శాతం చేసి వారికి ఆత్మ గౌరవం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆంగోత్‌బిందు, రాకేశ్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, రా మ్మోహన్‌రెడ్డి, మాళ్ల మురళీధర్‌రెడ్డి, మార్నెనీ వెంకన్న, యాకూబ్‌రెడ్డి, భరత్‌కుమార్‌ రెడ్డి, రవి చందర్‌రెడ్డి, గుడిపూడి నవీన్‌, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, కెఎస్‌ఎన్‌రెడ్డి, ఫరీద్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌.. కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

కమీషన్ల రూపంలో ఢిల్లీకి పోతున్న ప్రజాధనం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు తీరని అన్యా యం చేశారని ఎంపీ వద్దిరాజ్‌ రవిచంద్ర విమర్శించారు.

పార్టీ గుర్తు లేకుంటేనే బీఆర్‌ఎస్‌కు అన్ని సర్పంచ్‌ స్థానాలు వచ్చాయని, రాబోయే ఎన్నికలు పార్టీ గుర్తుతో ఉంటాయని, బీఆర్‌ఎస్‌ అధిక స్థానాలు గెలుస్తుందని ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్‌రావు అన్నారు.

గత ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని ప్రజలు అనుకోవడంతోనే బీఆర్‌ఎస్‌ ఓటమి చూడాల్సి వచ్చిందని, పార్టీ గుర్తు ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే అని మాజీ మంత్రి దయాకర్‌రావు అన్నారు.

నూకల రామచంద్రా రెడ్డిని కాంగ్రెస్‌ మర్చి పోయిందని, కేసీఆరే గుర్తు పెట్టుకుని విగ్రహం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు.

కాబోయే సీఎం కేటీఆర్‌ అని మాజీ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు.

ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో కరెంట్‌ తీసి ఫలితాలను తారు మారు చేశారని మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.

ప్రభుత్వం.. బీఆర్‌ఎస్‌ శ్రేణులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మండిపడ్డారు.

రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు 1
1/1

రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement