కాంగ్రెస్ .. పేదల కష్టాలు తీర్చే ప్రభుత్వం
మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్.. పేదల కష్టాలు తీర్చే ప్రభుత్వమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్‌లో నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్.. మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, అలాంటి సర్కారులో సర్పంచులుగా ఎన్నికయ్యారని, ఓడిపోయిన వారు అభద్రతా భావానికి లోనుకావొద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సర్పంచులందరూ ప్రజలకు మంచి సేవలు అందించి గ్రామాలను అభివృద్ధి ప థంలో నడిపించాలని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజాప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, పేదలకు భరోసా ఇచ్చే ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు చరుచుకుంటున్నారని, చేసింది త క్కువ ప్రచారం చేసుకున్నది ఎక్కువ అని విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి కృష్ణ, గోదావరి నీళ్లను ఇతరులకు ధారాదత్తం చేసిన ప్రబుద్ధులని, రెండేళ్లు ఫాంహౌస్‌లో ఉండి ఇప్పుడు బయటకొచ్చి కారుకూతలు కూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తాము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చుక్క నీటిని కూడా వదులుకోదన్నారు. అవాకులు, చవాకులు పేల్చే నాయకులు ఈ నెల 29వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు పోరిక బలరాంనాయక్, రామసహా యం రఘురాంరెడ్డి, ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్ల య్యనాయక్, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, జాటోత్ రాంచంద్రునాయక్, కోరం కనకయ్య, సంవిధాన్ బచాఓ కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు మాలోత్ నెహ్రూనాయక్, మానుకోట, కేసముద్రం ఏఎంసీ చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, ఘంట సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి..
మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన నూకల రామచంద్రారెడ్డి స్మారక కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడారు. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలిగినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


