చురుగ్గా కస్టమర్ చార్జీ వసూళ్లు..
హన్మకొండ: వ్యవసాయ సర్వీస్‌ల కస్టమర్ చార్జీల వసూళ్లపై టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. అయితే విద్యుత్ పంపిణీ మండలి ప్రతీ సర్వీస్‌కు రూ.30 చొప్పున కస్టమర్ చార్జీలు విధిస్తోంది. ఏడాదికి మొత్తం రూ.360 చొప్పున ఏటా డిసెంబర్‌లో వసూలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా బిల్లుల వసూళ్ల ప్రక్రియ చురుకుగా సాగుతోంది. స్వల్ప మొత్తం కావడంతో ప్రతీ సర్వీస్ నుంచి బకాయిలు వసూలు చేసే లక్ష్యంగా ముందుకెళ్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానిక విద్యుత్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కస్టమర్ చార్జీలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు వ్యవసాయ సర్వీస్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రైతుల నుంచి నిరసన, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత సమయంలో వ్యవసాయ సర్వీస్‌లకు విద్యుత్ కోత విఽధించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఉచిత వ్యవసాయ విద్యుత్ సర్వీస్‌లు
మొత్తం 13,84,126..
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉచిత వ్యవసాయ వి ద్యుత్ సర్వీస్‌లు మొత్తం 13,84,126 ఉన్నాయి. వీ టి బకాయిలు మొత్తం రూ.119,56,41,000 ఉన్నా యి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉచిత వ్యవసాయ సర్వీస్‌లు 4,02,062 ఉండగా బకాయిలు రూ.37, 62,82,000 ఉన్నాయి. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు విద్యుత్ అధికారులు గ్రామాల్లో రైతులను కలిసి కస్టమర్ చార్జీలు చెల్లించాలని కోరుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్కిల్ వారీగా
వ్యవసాయ సర్వీస్‌ల బకాయిల వివరాలు
సర్కిల్ ఉచిత వ్యవసాయ బకాయిలు
సర్వీస్‌లు (రూ.లక్షల్లో)
హనుమకొండ 68315 813.35
వరంగల్ 71633 776.03
భూపాలపల్లి 72011 1179.49
జనగామ 93532 89.15
మహబూబాబాద్ 96571 904.80
టీజీ ఎన్పీడీసీఎల్ వ్యవసాయ బకాయిలు రూ.119.56 కోట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
రూ.37.62 కోట్లు..
ప్రతీ సర్వీస్‌కు నెలకు కస్టమర్ చార్జీ రూ.30
ఏడాదికి రూ.360 చొప్పున వసూళ్లు
ఏటా డిసెంబర్‌లో వసూళ్లు..గ్రామాల్లో ముమ్మరంగా సాగుతున్న ప్రక్రియ


