ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలు మెండు
కేయూ క్యాంపస్ : ఫార్మసీ రంగంలో ఉపాధి అవకా శాలు మెండుగా ఉన్నాయని, వైద్యుడి కంటే ఫార్మసిస్టే కీలకమని హైదరాబాద్ అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూని వర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రారంభమాయ్యయి ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు. గొప్ప కళా శాలంటే భ వనాలు వసతులు కాదు, అక్కడ అధ్యాపకులు చేసే విద్యాబోధన అన్నారు. అరబిందో సంస్థ 1986లో రూ.20 లక్షల తక్కువ మూలధనంతో నే ఏర్పాటు చేశామని, నేడు కెమిస్ట్ ఉత్పత్తిదారుడిగా ప్రపంచ స్థాయి సంస్థగా అవతరించిందన్నారు. నాణ్యత పాటించటడంతోనే ఇది సాధ్యమైందన్నారు.
అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని..
కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో తా ము చదువుకున్న రోజుల్లో వసతులు తక్కువగా ఉండేవని, అయినా క్రమశిక్షణ గల అధ్యాపకులతో ఉన్నత స్థితికి చేరుకుని దేశ విదేశాల్లో ఎన్నో ఫ్యాక్టరీలను స్థాపించానని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ డీన్ మన్సూర్‌ఖాన్ అన్నారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ఉన్నత స్థితికి ఎదగాలన్నారు.
పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలి
ప్రపంచ స్థాయి పరిశోధనలు కలిగిన కేయూ ఫార్మసీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో మంది దేశ విదేశాలల్లో స్థిర పడ్డారని, వీరిని యువ విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 3,000 మంది బీ ఫార్మసీ, 1800 మంది ఎం.ఫార్మసీ 400 మంది పీహెచ్‌డీలు, 3 వేలకుగాపై పరిశోధన పత్రాల సమర్పన కళాశాల గొప్పతనమన్నారు. కేయూ రిటైర్డ్ ఆచార్యులు వి. కిషన్ మాట్లాడుతూ ఎండోమెంట్ లెక్చర్లు, ఎండోమెంట్ చైర్, డిజిటల్ తరగతి గదులు, ధన్వంతి విగ్రహం, ల్యాబ్, లైబ్రరీ పెంపు వసతులు టార్గెట్‌గా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఫార్మసీ కళాశాల పూర్వవిద్యార్థి, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు సాంబారెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి, డీన్ ఆచార్య గాదె సమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. ప్రసాద్, డిప్యూటీ డ్రగ్‌కంట్రోల్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎ. రాంకిషన్, యూఎస్‌ఏ ఎఫ్‌డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి, తెలంగాణ డ్రగ్స్ కంట్రోలర్ జాయింట్ డైరెక్టర్ జి. రాంధన్, రిటైర్డ్ ప్రొఫెసర్లు మల్లారెడ్డి, అమరేశ్వర్, రాంభహు, తదితర పూర్వ విద్యార్థులు తరలొచ్చారు. కాగా, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఆదివారం (నే డు) ముగియనున్నాయి.
వైద్యుడి కంటే ఫార్మసిస్టే కీలకం..
అరబిందో ఫార్మా డెరెక్టర్
మదన్‌మోహన్‌రెడ్డి


