ఎన్పీడీసీఎల్‌కు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవ
హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్ రక్షణాత్మక విధానాలు, ఉద్యోగుల ఆరోగ్యంపై కనబరుస్తున్న శ్రద్ధకు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా –2024 సంవత్సరానికిగాను సేఫ్టీ అవార్డు అందించింది. ఈ నెల 23న ముంబాయిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ (ఐటీ,ప్లానింగ్) ఎన్.శ్రవణ్ కమార్, వరంగల్ సర్కిల్ టెక్నికల్ డీఈ, సేఫ్టీ ఆఫీసర్ వై.రాంబాబు అవార్డు స్వీకరించారు. ఈ అవార్డును శనివారం హనుమకొండలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల తగ్గింపునకు చర్యలు తీసుకున్నామని, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఈ సేవలను గుర్తించిన నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2024 సంవత్సరానికి సేఫ్టీ అవార్డు అందించిందన్నారు. 5,580 మంది ఉద్యోగులకు, 787 మంది కాంట్రాక్ట్ కార్మికులకు భద్రతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5,340 పొలం బాట కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్యం చేసినట్లు తెలిపారు. ౖ ఈ అవార్డు రావడంలో ప్రతీ ఉద్యోగి కృషి ఉందన్నారు.
పోలీసుల అదుపులో
అంతర్రాష్ట్ర దొంగల ముఠా ?
కాజీపేట: కాజీపేట పట్టణంలో ఇటీవల ఏటీఎంలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు సభ్యుల ము ఠా కాజీపేటకు వచ్చి ఏటీఎం కేంద్రాల్లో కస్టమర్లను బోల్తా కొట్టిస్తూ డబ్బులు దోచుకుంటుంది. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయ గా సీఐ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో క్రైం పార్టీ పోలీ సులు పట్టణంలోని పలు ఏటీఎం కేంద్రాలపై నిఘా పెంచారు. నాలుగు రోజుల క్రితం ఓ ఏటీఎంలో బాక్స్ తెరచి డబ్బులు కాజేయడానికి యత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వి చారించగా నిందితుడి సమాచారంతో మరో ఆరుగురిని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. నిందితులు ఏటీఎం బాక్స్‌లు తెరచి ప్లాస్టిక్ కవర్లను లోపల అమర్చుతున్నారు. ఈ విషయాలు తెలియని ఖాతా దారులు డబ్బులు డ్రా చేయగా బయటకు రావడం లేదు. ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసె జ్‌లు మాత్రం వస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కొద్ది రోజులుగా నిఘా పెంచి నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది.


