సర్పంచ్‌లతోనే గ్రామాల అభివృద్ధి : సీతక్క
కొత్తగూడ: సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి సాధకులు అని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కొత్తగూడ, గంగారం మండలాల నూతన సర్పంచ్‌లను సన్మానించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రెండు మండలాల్లో మన మీద నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని అన్నారు. వారి నమ్మకం వమ్ము కాకుండా అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధిచేయాలని సూచించారు. మీ గ్రామాలకు ఏం కావాలో అడగండి.. ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం గ్రామాల వారీగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంజ కుసుమాంజలి, వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, చల్ల నారా యణరెడ్డి, బిట్ల శ్రీనివాస్, మల్లెల రణధీర్, కారోజు రమేశ్, రూప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


