ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి
రైతు వేదికల నిర్వహణకు 39 నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఏఈఓలు సొంత డబ్బు వెచ్చిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమావేశాల సమయంలో హాల్‌ను సిద్ధం చేయడం, కుర్చీలు వేయడం వంటి పనులకు అటెండర్లు లేక ఏఈఓలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతీ రైతు వేదికకు అటెండర్‌ను నియమించాలి. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి.
– చెలికాని రాజు, ఏఈఓల జేఏసీ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వానికి నివేదించాం
రైతు వేదికల్లో నెలకొన్న ఇబ్బందులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వీటి నిర్వహణకు సంబంధించి నిధులు విడుదల కావాల్సి ఉంది. అవి రాగానే వేదికలకు కేటాయిస్తాం. – విజయనిర్మల, డీఏఓ
ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి


